కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్య తనకు మ్రొక్కెడు పతి శిరమును బాదమునఁ దొలఁగఁ ద్రోయుట
మ. జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి సిరమచ్చో వామ పాదంబునం
తొలగం ద్రోచె లతాంగి ! యట్ల యగు నాథుల్‌ నేరముల్‌ సేయ పే
రలుకన్‌ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్‌ నేర్తురే?
121
క. కోపన పద హతి కుహనా
గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవఁగ ను
ద్దీపిత మన్మధ రాజ్య
ప్రాపితుఁడై పలికె కూర్మి బయట పడంగన్‌
122
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )