కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్య విలాప మోహనత
ఉ. ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్‌ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయి చేల చెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్‌
133
ఉ. ఆ రమణీ లలామ మదినంటిన కోపభరంబు నిల్పఁగా
నేరక నెవ్వగం బొగుల నీరజ నాభుఁడు నిండు కౌఁగిటం
జేరిచి బుజ్జగించి నునుఁ జెక్కుల జాలుకొనంగ జాఱు క
న్నీరు కరంబునం దుడిచి నెయ్యము తియ్యము దోఁప యిట్లనెన్‌
134
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )