కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
పారిజాతాపహరణము - ద్వితీయాశ్వాసము
క. శ్రీ సదన లోచనాబ్జ ద
యా సార మరంద పోషితార్థి భ్రమరో
ల్లాసగుణ! మలయకూట
ప్రాసాద నివేశ! కృష్ణరాయ మహీశా!
1
తే. అవధరింపుము జనమేజయ క్షితీశ
వరున కిట్లను నమ్మౌని వల్లభుండు
పారిజాతంబుఁ దే నిట్లు ప్రతిన వల్కి
చంద్రశాలకు నేతెంచి చక్రధరుఁడు.
2
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )