కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు సత్యభామను రసాంబుధి నోలార్చుట
మ. సరసాలాపముల న్వినోదకథల న్సాత్రాజితీదేవిఁ బ్రే
మ రసాంభోనిధి నోలలార్చి కడు సమ్మానంబు గావించి ని
ర్భర కౌతుహల వృత్తినుండ ఘటికాపర్యాప్తి ఘంటారవాం
తర నిర్ణీతములై వినంగఁబడియె న్మధ్యాహ్న శంఖధ్వనుల్‌.
3
తే. సమయ కృత్యంబు లప్పుడు సలుపఁ దలఁచు
నలిననాభుని చిత్తంబు దెలిసి సత్య
భామ కనుసన్న నుడిగంపుఁ బద్మముఖులు
నిలిచి రంతంత వినయంబు దొలఁక నెదుట.
4
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )