కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
నారదుని వీడుకోలు
క. అని పలికి శౌరిఁ గనుఁగొని
దనుజాంతక! పోయివచ్చెదను మఱవకుమీ
నను నావుడు గోపవధూ
జన వంచకుఁ డనియెఁ గార్యసంఘటనేచ్ఛ\న్‌.
27
చ. అదితి మొఱంగి కుండలము లా నరకుండు హరించె, వాని నేఁ
గదనములోనఁ ద్రుంచి యవి కైకొని దాఁచితి నాఁటనుండియుం
బదిలముగాఁగ, నన్నడుగఁ బంపనికారణమేమి? లాఁతినే?
యిదె చనుదెంచి యిత్తు ననుమీ శతమన్యునితోడ సంయమీ!
28
చ. అని వినయంబుతోడఁ గలహాశన సంయమి వీడుకొల్పి యం
గనయును దాను నచ్చట జగత్పతి జూదపువేడ్కనున్నచో
దినకర మండలం బపర దిగ్గిరికూటముఁ జేరె యాదవీ
జన మదిరా రసారుణ విశాల దృగంచల వంచక చ్ఛవి\న్‌.
29
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )