కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
నక్షత్ర వర్ణనము
సీ. కార్కొన్న కటికచీఁకటి మొగు ల్మొత్తంబు - గురిసిన వడగండ్ల గుంపు లనఁగఁ,
గవ జక్కవలు వాయఁ గరనాళములఁ జందు - రుం డూఁదు పటికంపు టుండ లనఁగ,
నెల్లెడ మిన్నేటి యిసుమున నచ్చర - కొమ లిడ్డ వెన్నెలకుప్ప లనఁగ,
దెలివి వెన్నెల వెండితీఁగలు నిగిడించు - చదలు కమ్మచ్చు బెజ్జము లనంగ,
 
తే. జగము గెల్వంగ దండెత్తు మగని మీఁద
లీల రతి చల్లు దీవనఁ బ్రాలనంగ,
వేఁడివెలుఁ గెండఁ గ్రాఁగిన విన్ను మేన
నెక్కొను చెమటబొట్లు నాఁ జుక్కలమరె.
37
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )