కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
చకోరముల బువ్వఁపుబంతి
సీ. విరహుల మై సోఁకి వేడి యౌ వెన్నెలఁ - బచ్చివెన్నెల నులివెచ్చఁ జేసి,
కలువ పుప్పొళ్ళచేఁ గసటైన వెన్నెల - వలిప వెన్నెలలోన వడిచి తేర్చి,
చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల - ముదురు వెన్నెల జుఱ్ఱఁ బదను చేసి,
సతుల మైపూఁత బిసాళించు వెన్నెలఁ - దనుపు వెన్నెల రసాయనము గూర్చి,
 
తే. చిగురు విలుకాని జాతర సేయఁ బూని
కొలముసాముల నందఱఁ గూడఁబెట్టి
వంతుగలయంగ బువ్వంపుబంతి విందు
పెట్టి రెలమిఁ జకోరపుఁ బేరఁటాండ్రు.
49
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )