కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
వలరాజు దండయాత్ర
సీ. కామినీ మాన మేఘ శ్రేణి విరియంగఁ - దొగ ఱెల్లుగుంపులు తొంగలింప,
సాంధ్యరా గావిల చంద్రికాంబులు దేఱ - నిరుల మొత్తపు టస లివురఁ బాఱ,
యువజన రాగ పయోరాసు లుప్పొంగ - వెలిదమ్మి జాజిపువ్వులు ముడుంగ,
మద చకోర మరాళ మండలి చెలరేఁగఁ - బఱచు చేడియ లను మెఱపు లడఁగ
 
తే. నభినవ శర త్సమాగమం బనఁగ మించు
నట్టి రాకా నిశా వేళ నలరువింట
గొనయ మెక్కించి వలరాజు కినుక మీఱ
విరహి జనములపై దండువెడలె, నపుడు.
50
ఉ. ఆ నలినాయతాక్షు గడియారమునం దభిసారికా జిఘాం
సా నిరత ప్రసూనశర చాప గుణ ధ్వనులో యనంగ ఘం
టానినదంబు లయ్యెడ వినంబడియెం గుపితాబ్జలోచనా
మానసము ల్చలింపఁ బ్రథమ ప్రహరాపగమ ప్రశంసు లై.
51
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )