కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
వేగుచుక్క వర్ణనము
మ. నలినాప్తుండు మదీయ బంధులను తా నక్షత్ర సంఘంబులం
గలఁప న్వచ్చుచు నున్న వాఁ డనుచు మున్గల్గంగ నాత్మీయ శి
ష్యుల మందేహులఁ బోరొనర్పఁ జనుఁడంచుం బంపి యేతెంచెనాఁ
బొడమె న్వేగురుఁ జుక్క కాలఫణ భృద్భోగోల్లస ద్రత్నమై.
54
క. వైతాళికు లప్పుడు మృదు
గీతామృత వచన రచన గీలుకొన యశో
దా తనయు మేల్కొలుపఁ బ్రా
భాతిక రమణీయ రాగ ఫణితులు సెలఁగె\న్‌.
55
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )