కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
మధుప విలాపము
సీ. పరువంబు గాఁకఁ జొప్పడని మామిడితేనె - లాన నాసాస నఱ్ఱాడునవియుఁ,
దమకించి చిగురాకు గమిచి నో రొగ రైనఁ - గడఁగి గొజ్జఁగినీటఁ గడుగునవియు,
సంపంగి పొదరింటిచక్కి గోరఁటఁ గాంచి - యుసు రంచు మగిడి నోరూరునవియుఁ,
గలిగొట్టు పసరు మొగ్గలఁ గోర్కి పొలివోయి - మునుపటిమొల్లల మూఁగునవియుఁ,
 
ఆ. నగుచుఁ దేఁటికదుపు లామనిఁ దలసూపెఁ
జూపుదనుక నెల్లచోటఁ దోఁట
యందుఁ దామ యగుచు నమ్మరునెలగోలు
పౌఁజు లనఁగఁ జూడ్కిపండు వగుచు.
51
క. నంద ప్రియనందనుఁ డా
నందన మఖిలర్తు నందనం బై నయనా
నంద మొనరింప నమరీ
బృందంబులు గొలువఁ జనుచుఁ బ్రియసతి కనియె\న్‌.
52
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )