కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
పారిజాతాపహరణము - చతుర్థాశ్వాసము
క. శ్రీ వేంకటగిరి వల్లభ
సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవీ
జీవితనాయక! కవితా
ప్రావీణ్య ఫణీశ! కృష్ణరాయమహీశా!
1
తే. అవధరింపుము జనమేజయ క్షితీశ
వరున కిట్లను నమ్మౌనివల్లభుండు
వనవిహారంబు సలుపుచు వచ్చి వచ్చి
పారిజాతంబు గాంచి సంభ్రమ మెలర్ప.
2
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )