| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| చంద్రోదయ శోభ | ||
| మ. |
వనజశ్రీ ధన పశ్యతోహరుఁడు, జీవంజీవజీవంబు, ప చ్చనివిల్కానికి మామ, చల్వగని, పశ్యత్ఫాల జూటాగ్ర మో హన రత్నంబు, సుధాకరుండపుడు ప్రాగద్రి స్థలీవీథి నొ య్యనఁ దోతెంచె వియత్తటీ కషణ లీలానీత శంఖాకృతి\న్. |
47 |
| క. |
ఆరాత్రి సత్యఁ గూడి ము రారి ముదం బెసఁగ వైజయంతమున మనో భూ రాజ్య సౌఖ్య నిద్రా పారీణత నుండుచోఁ బ్రభాతం బయ్యె\న్. |
48 |