కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
వనపాలకు లడ్డగింపఁ బోవుట
చ. తగునె యదుప్రవీర! యిటు ధౌర్త్యము నీవొనరించి యీమరు
న్నగము హరించి వంచనఁ జన\న్‌, దివిజాగ్రణి దీని నిచ్చె ద
క్కుగ నిజకాంత కా కుసుమకోమల యాజ్ఞ భయంబునొందుఁ దేఁ
టిగములు దీనిచెంగట నటింపను బువ్వుల తావిఁ గ్రోలఁగ\న్‌.
56
క. అట్టి సురతరువు నెఱుఁగక
చుట్టపు మేలమునఁ గొంచు సురిఁగెడు మది నీ
కెట్టు జనియించె; మరలం
బెట్టుము; బలభేది విన్న మేలే నీకు\న్‌?
57
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )