కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఇంద్రుఁడు రౌద్రాకృతిఁ దాల్చుట
శా. ఆ మాటల్విని పాకశాసనుఁడు రౌద్రాకారుఁడై పేర్చి యే
మేమీ కృష్ణుఁడు మందలో బలెనె తా నింద్ర ద్రు మోత్పాటనం
బీమై నిచ్చటఁ జూపవచ్చె; నిది మేలే; తార్క్ష్యుఁడైన న్మదీ
యామోఘాశని పాత మిట్టిదని యాహా! తెల్పఁడాయెం జుమీ.
61
మ. అని పౌలోమి మొగంబుఁజూచి వినుమో యబ్జాస్య! నీకింతమా
త్రన విన్నంబడ నేల? పోదు నిదె సత్యా గర్వభంగంబు ది
వ్య నగంబు న్విడిపించి వత్తునని సాహంకారుఁడై లేచి చ
య్యన శుద్ధాంతగృహంబు వెల్వడి సుధర్మాస్థాన మధ్యస్థుఁడై.
62
ఉ. తానఁటె పారిజాత వసుధారుహముం గొనిపోవువాఁడు, క
న్గానఁడు యాదవుం డనుచుఁ గన్నులు వేయులు జేవుఱింప వై
శ్వానర ధర్మ దైత్యవర వారిధిపానిల యక్షనాయ కే
శానుల దిక్కుచూచి కులిశంబు కరంబునఁ బూఁచి పట్టిన\న్‌.
63
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )