కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. బాణద్వి ణ్మథి తాంబుధి ధ్వని కళా పాణింధ మానీక ని
స్సాణ స్వాన భిదేళి మాద్రితట! నిస్సామాన్య చాపాగమ
ద్రోణాచార్య! సురీ సమూహ వరణో ద్యుక్తాహిత శ్రేణి ని
శ్రేణీభూత కృపాణ! మాంసల భుజా శేషాహిపత్యుద్ధరా!
91
శా. వాజ్యారోహణనైపుణీనకుల! దోర్వాతంధ యారూఢ స
ర్వ జ్యాచక్ర! రజస్తమశ్చయ తమిస్రా రూప జన్యాంగణ
ప్రాజ్యోద్గీత యశ శ్శశాంక! దళితారాతి క్షమాపాల ర
క్తా జ్యోదంచ దుదార శౌర్య హుతభు గ్వ్యాప్తాభి లాశాంతరా!
92
క. చండతర మూరురాయర
గండ మహాబిరుద! ధాటికా రయ విచల
త్కొండపలి కొండవీటీ
మండల కటకేశ సింధు మందర కుధరా!
93
తోటకము. త్వరితాధరితానిలవాజి నట
త్ఖురజోరు రజోభర గూఢ రవి
స్ఫురణా! కరణాధిక శూత్కృతి మ
ద్ద్విరదాకర దారణ వీరబలా!
94
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార
సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక
గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన
పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ చతుర్థాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )