కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
అమరసేన శ్రీకృష్ణుని చుట్టుముట్టుట
ఉ. వచ్చితి మింక నెందుఁ జనవచ్చు నొహో! నిలు, పారిజాత పా
టచ్చర! యంచు జంకెలు గడల్కొనఁ గృష్ణునిఁ జుట్టుముట్టి వై
యచ్చరసేన దాఁకునపు డచ్చల మేమని చెప్ప! దిక్కులం
జిచ్చఱ తూపుఁ దండములు సింహరవంబులు నిండె నొక్కట\న్‌.
3
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )