కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు యుద్ధమునకు సంసిద్ధుఁడగుట
ఉ. ఆ కమలాయతాక్షి నమరావనిజాతము డించి సంభ్రమ
న్నాకపురీ మహారథుల నవ్వుచుఁ గన్గొని యంగుళిత్ర గో
ధా కలనంబుతో యదువతంసుఁడు శార్ఙ్గనిబద్ధ శేష ని
ర్మోక నిచోళముం దిగిచె రోష నట ద్భ్రుకుటీ విలాసుఁడై.
4
క. తిగిచి, శరాసన మెక్కిం
చి, గుణధ్వని చేసి, యంస శిరముల దొనల\న్‌
బిగియించి, తూపు లొక్కట
నిగిడింపఁ దొడంగె మరు దనీకిని మీఁద\న్‌.
5
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )