కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
పారిపోవుచున్న దిక్పతుల నింద్రుఁ డదలించుట
చ. హరిహయుఁ డాగ్ర హోజ్జ్వలితుఁ డై యనిఁ బాఱు దిశానాథుల\న్‌
దిరుగుఁడు పోకు పోకుఁడని తిట్టి యదల్చి నవోదయ త్పయో
ధరము నలంకరించు తన ధన్వ మధిజ్యము చేసి గోత్రభీ
కరముగ బాహులెత్తి తమకంబున సేనకుఁ జేయివీచిన\న్‌.
14
క. గిరితటముఁ దాకి తిరిగెడు
తరంగిణియుఁ బోలె దేవతాపతి యాజ్ఞ\న్‌
మరలి వియచ్చర వాహిని
మురహరునిం బొదివి ఘోరముగఁ బోరునెడ\న్‌.
15
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )