కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
దిక్పతు లొక్కుమ్మడి శ్రీకృష్ణుని దాఁకుట
చ. అనలుఁడు రెండు, మూఁడు యముఁ, డాసురనాథుఁడునాలు, గైదు తో
యనిధిపుఁ, డాఱు గంధవహుఁ, డర్థపుఁ డేడు, మహేశుఁ డెన్మిది\న్‌
ఘనవిశిఖంబు లేయ మురఘస్మరుఁ డన్నియుఁ ద్రుంచి శార్ఙ్గ సం
జనిత మహోగ్రభల్లముల జర్జరితాంగులఁ జేసె నందఱ\న్‌.
22
ఆ. వేల్పుమ్రానియందు వేడుకపడు కూర్మి
సతుల కోర్కిఁ దీర్పఁ జాలి యపుడు
హరియు హరియుఁ బోరి రన్యోన్య జయకాంక్ష
నసుర జీవనాపహాశుగముల.
23
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )