కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
ఇంద్రుఁడు కృష్ణునకు మ్రొక్కుట
ఉ. ముందల వట్టినట్లు తన ముఖ్యతరాస్త్రము గొన్న దేవకీ
నందనుఁజూచి సాధ్వసము నానయుఁ గ్రమ్మఁ గరీంద్రు డిగ్గి సం
క్రందనుఁ డో ముకుంద! మురఘస్మర! యే నపరాధి నంచు వే
ముందఱవచ్చి సాఁగఁబడి మ్రొక్కిన శౌరి కృపార్ద్ర చిత్తుఁడై.
38
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )