కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారద పునరాగమనము
వ. ఇవ్విధంబున నభీష్ట ఫలసిద్ధి సంతోషిత స్వాంతులును నిఖిల
లోకైక సంస్తూయమాన మహామహిమోదాత్తులు నై నిరంతర సౌఖ్య
వర్ధిష్ణులగు నా సత్యాకృష్ణులను జూచువేడుకం గ్రమ్మఱ నొక్కనాఁడు
నిజతను ప్రభా ప్రభావాపహసిత శారద నీరదుం డగు నారదుం
డరుగుదెంచి యాదంపతులు సేయు సత్కారంబులం బరితుష్టి నొంది
సుఖోపవిష్టుండై యిష్టాలాప సమయంబున నుల్లసిత ముఖారవిందుం
డగుచు నయ్యిందువదనం గనుంగొని.
53
తే. హేమనిభగాత్రి! నీభాగ్య మేమి చెప్ప
జిష్ణుభూజంబు నీ పెట్టుచెట్టుఁ జేసి
సవతులన కాదు త్రిభువనేశ్వరి యనంగఁ
బొలుచు పౌలోమి గెలిచితి వలఘు మహిమ.
54
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )