| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| ఇలావంతుని జననము | ||
| క. |
ఈ గతి రతి కేళీ సుఖ సాగరమునఁ దేలియున్న సమయంబునఁ, ద ద్యోగం బెటువంటిదొ, స ద్యోగర్భంబున సుపుత్త్రుఁడొకఁ డుదయించెన్ |
111 |
| క. |
ఆ చక్కని బాఁలుడు వాక్ ప్రాచుర్యముఁ గాంచునని శుభగ్రహ దృష్టుల్ చూచి యిలావంతుండని యా చతురుఁడు నామకరణ మలరిచి యంతన్ |
112 |
| ఉ. |
కామినిఁ జూచి "రమ్ము గజగామిని! యిక్కడ నొక్కవాఁడిఁకన్ దామస మైన నక్కడ హితవ్రతి తైర్థికకోటి యాత్మలో నేమని యెంచునో? యిపుడ యేఁగవలెన్, దరువాత నీసుత గ్రామణి, నీవు వచ్చెదరు గా!" కని యూఱడిలంగఁ బల్కినన్ |
113 |