కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
ఉలూచి యర్జునునకు వీడ్కోలొసఁగుట
ఉ. అంటిన ప్రేమ జాహ్నవికి నప్పుడ తోడ్కొని వచ్చి, యల్ల వా
ల్గంటి నిజేశ్వరున్‌ దనదు గబ్బి చనుంగవఁ జేర్చి, బాష్పముల్‌
కంటఁ దొరంగుచుండఁ దిరుగం దిరుగం గనుఁగొంచుఁ గ్రమ్మఱెన్‌
జంట దొఱంగి సంజను వెసం జను జక్కవ పెంటియుం బలెన్‌
114
ఉ. అంతట రాజురాకఁ గని యాప్త పురోహిత భృత్య వర్గ మ
త్యంత ముదమ్ము చెంది "యిటు లార్తులఁ గాచుట కేమొగాక యే
కాంతము గాఁగ నేఁగుదురె? యంచుఁ దలంచితి; మీరు వచ్చు ప
ర్యంతము మమ్ము మే మెఱుఁగ; మందఱ ప్రాణము లీవ భూవరా!"
115
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )