కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
కృష్ణుఁ డర్జునుని రైవత పర్వతమున నిలుపుట
ఉ. గ్రుచ్చి కవుంగిలించుకొని, కూరిమితోఁ గుశలంబు వేఁడి, తా
వచ్చిన రాక లోఁ దెలిసి, "ద్వారక రైవతకాద్రి పొంతనే,
యిచ్చటికిన్‌ సమీప" మని కృష్ణుఁడు తెల్పుచుఁ, దోడితేరఁగా
వచ్చె రథంబుపై నపుడు వాసవి వేసవి యేఁగునంతటన్‌
86
తే. వచ్చి రైవతకారామ వాటి నిల్చి
కృష్ణుఁ డం దిష్ట గోష్ఠి నా రేయి కడపి
"యిచట నుండుము, తావకాభీష్ట మిపుడు
చేయుదు" నటంచుఁ బైతృష్వసేయు నిలిపి
87
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )