కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
సన్న్యాసి సుభద్రకు శకున శాస్త్రము చెప్పుట
తే. చెలువ! నిను రాజకీరంబు చెట్టవట్టెఁ
గలికి! నిను రాజకీరంబు కాలుద్రొక్కె
మంచిశకునంబు లివిగొ నామాటఁ జూడు
కన్నె! యీలోనఁ బెండ్లిగాఁగలదు నీకు.
159
క. అనవుడు లజ్జావనతా
ననతామరస యయి వీరు నాఁగ మహాత్ముల్‌
తన చేసిన సేవకుఁగా
మన మలరి వచించి రనుచు మది నుత్సుక యై.
160
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )