కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
సన్న్యాసి తానే యర్జునుఁడని బయట పడుట
ఉ. అక్కఱతోడ మంతనమునం దిటు వేఁడెదు గాన నంతయు\న్‌
నిక్కము గాఁగఁ దెల్పఁ దగు నీకటు లైన సురేంద్రసూతి యీ
దిక్కున నున్నవాఁ డనుచుఁ దెల్పినతోడనె మాట లాడకే
యెక్కడఁ బోదువో యని యొకించుక సంశయ మయ్యెడుం జెలీ!
173
క. ఆ కవ్వడి యతివేషముఁ
జేకొని యున్నాఁడు నీకుఁ జెంతనె యెన్నా
ళ్లో కలదు వచ్చి యింకను
నీకీలక మించు కైన నీ వెఱుఁగవుగా.
174
క. నీకై తపంబు జేసెద
నీకైవడి దాఁప నేల యే నర్జునుఁడ\న్‌
లోకోత్తరశుభలగ్నం
బో కోమలి నేఁడు గోర్కు లొడఁగూర్పఁగదే!
175
ఉ. నా విని యావినీలకచ నవ్వుమొగం బటు గొంత వంచియెం
తే వెఱ నివ్వెఱ\న్‌ మునిఁగి యీతనిఁ బార్థునిఁగా నొకింతము\న్‌
భావమునం దలంచియును నమ్మక యమ్మకచెల్ల యూరకే
సేవ లొనర్చుచుంటి నని సిగ్గున దిగ్గున లేచి పోవఁగన్‌.
176
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )