| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| శా. |
దాక్షిణ్యాకరమూర్తి! షోడశమహాదానాదిపుణ్యక్రియా దక్షా! యాశ్రిత దీన రక్షణకళా ధౌరంధరీ సత్కృపా వీక్షా! శాశ్వతకీర్తి వైభవ రమా భృచ్చోళసింహాసనా ధ్యక్షా! దుర్దమరాట్కిరీటదళనైకాక్షేయ కౌక్షేయకా. |
204 |
| క. |
కలహారంభణకౌతూ హలపులకిత భుజపరాక్రమార్జిత నానా జలదుర్గవనీదుర్గ స్థలదుర్గాహార్య దుర్గసామ్రాజ్యనిధీ! |
205 |
| స్రగ్విణి. |
దుగ్ధవారాశివిద్యోతికీర్తీ! సుధా భుగ్ధురీణామనాగ్భోగవర్తీ! దయా దృగ్ధుతాశేషధాత్రీమరున్నిస్స్వతా! స్నిగ్ధసారస్వత స్సిద్ధసారస్వతా! |
206 |
| గద్యము. | ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందుఁ ద్వితీయాశ్వాసమ్ | |