కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
మలయాని లోపాలంభనము
క. తరుణిమయితావియీసునఁ
బురికొల్పెడునిన్ను గందపుంగొండ యిటుల్‌
పురికొల్పెనె తానుం దా
మరకొలఁకులరమయు మలయమరుదంకురమా!
47
క. తెమ్మెర! నీ కెం తెమ్మెర!
కమ్మనివిలుకానిదొరవు క మ్మని నెలఁ బై
రమ్మని యళిపికశుకనిక
రమ్మని గా నిలిపి ముందరఁగ వచ్చితివా?
48
పంచ
చామరము.
జోహారు మీకుఁ జల్లఁ గాఁగఁ జూడుఁడో సమీరకం
జహారులార! మంటమారి శంబరారిఁ గూడి యీ
గొహారు సేయ నేల? యీ చకోరలోచన\న్‌ భుజం
గహారుపాద మాన మీకుఁ గాఁక లింక రేఁచినన్‌.
49
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )