| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| అంతర్ద్వీపమున శివుని జాతర | ||
| క. |
అంతటఁ బశుపతిపూజకు నంతటఁ జాటంగఁ బనిచి హరి యరిగెఁ బ్రలం బాంతకు వసుదేవుని ము న్నంతర్ద్వీపమున కేఁగు మని యావెనుకన్. |
72 |
| క. |
యదువృష్ణిభోజకులజులు కదలి రపు డనేక బాలికామణి భూషా మృదుల పరిధాన పరిమళ విదిత మహైశ్వర్యధుర్య విభవోన్నతులై. |
73 |
| ఉ. |
ఈగతి నంతరీపమున కెల్లజనంబులతోడ నేఁగి యం దాగమవేద్యశీలికి నతామరపాళికి నిందుమౌళికిం ద్యాగము భోగముం జెలులయాటలుపాటలు నిత్యకృత్యమై సాగఁగఁ జూచుచుండి రల శౌరియు సీరియు సంభ్రమంబునన్. |
74 |