| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| ఉ. |
క్ష్వేళగళైణలాంఛన విజిత్వర శుభ్రయశోవిశాల! ధా రాళగళన్మద ద్విరదరాజివిరాజిసభాంగణా! ఘనా వేలగరిష్ఠదానపదవీపరితోషితకాళగౌతమీ చోళకవిద్విజస్తుతవచోలగ! చోలగమానభంజనా! |
238 |
| భుజంగ ప్రయాతము. |
అరాతిక్షమాభృద్భిదాంచత్కృపాణా! నరాధీశ్వరాకారనాళీకబాణా! స్థిరానందనా రామసేవాధురీణా! విరాజచ్చతుష్షష్టివిద్యాప్రవీణా! |
239 |
| గద్యము. | ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము | |