కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

12. జ్ఞాపకాలు

నా పేరు లీల!

ఆ ఊరిగోల పడలేక నేను పొరుగూరొచ్చాను! అందాలవాడే అడవిలో ముంచాడు; అందరిని తలచుకొని అల్లాడుచున్నాను.

ఏకాకినై నేను దూరాన ఉన్నాను దారినే పోయే అమ్మలక్కలు జేరి ముండ్ల చూపులు చూచి అడుగుతూ పోతారు.

ఏకాకినై నేను నడిజాము వరకూ మేలుకొని మృత్యువును బ్రతిమాలు కొన్నాను!

అమ్మమ్మ జ్ఞాపకం, అమ్మ జ్ఞాపకం, చెల్లెలు జ్ఞాపకం, నాన్న జ్ఞాపకం, అన్నలే జ్ఞాపకం, తమ్ములే జ్ఞాపకం, అందరిలో నువ్వే ఆఖరి జ్ఞాపకం! రావేల! రావేల రాత్రి వచ్చింది! మధురమౌ మగవాడ నాప్రేమ నిజమోయి!

ప్రాభాతమౌ వేళ జ్ఞాపకాలొచ్చాయి!
తలిచి తలిచీ నిన్ను జ్ఞాపకాలొచ్చాయి!
పవళింపు సమయాన జ్ఞాపకాలొచ్చాయి!
తలనొప్పి తీర్చుతూ తలగడగ రావోయి!
చలికాల మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
చైత్రమాస మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
వర్షాకాల మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
పిలుపులకు పలకనందులకై ఈఘడియ
ఈక్షణము జ్ఞాపకాలొచ్చాయి! రావేల
మగవాడ! ఒడ్డూ పొడుగూవాడ!

ఏకాకినై నేను ఏదారిపోయినా పిలుపు పిలుపుకు పలికే జ్ఞాపకాలొచ్చాయి! ఏకాకినై నే ఏమి పనిజేసినా తలుపు తలుపుకు త్రవ్వి జ్ఞాపకాలొచ్చాయి! మరో పిల్లను నీవు మరులు గొల్పావో, వేరో

పిల్లకు నీవు ఉరులు వేశావో, రావోయి రావోయి త్వర త్వరగ రావోయి, నాకన్ను చెదిరింది పురుషులను జూస్తూ!

బుల్‌ బులుల హాయికై కిల కిలల జోలకై పరితపించే మనస! కన్నీళ్ల హృదయమా! బుల్‌ బులుల మన్నా కిల కిలల మన్నా ముత్తైదు ముద్దు టుయ్యాలకే కద్దు!

బులు బులుబులు బులా హాయీ యీ! హాయమ్మ, నెవ్వరూ పురిగొల్పినావారు? పురిగొల్పినావాడు పురుషుడే కాడు! మగ పిల్లవాడవో, ఆడపిల్లవో నీవు, మగవాడవై నీవు మాయదారి వవకుండ, ఆడపిల్లవై నీవు అర్ధాన్న మవకుండ ఎన్నెమ్మయే వచ్చి పురుడు పోసింది! కొత్తెమ్మయే వచ్చి ఉగ్గు కలిపింది! పోతరాజే వచ్చి చేదవేశాడు! కొత్తెమ్మయే వచ్చి చాట పరిచింది!

బులు బులుబులు బులా హాయీ యీ! హాయమ్మ నెవ్వరో చంకెత్తి కెళ్ళారు! నా చన్నులో పాలు చేపుతున్నాయే! ఉయ్యాలలో పిల్ల ఉబుసులే లేవు! నా చన్నులో పాలు జున్ను లెత్తాయే!

హాయమ్మ కెవ్వరూ హాయన్న వారూ! నీలాల సంద్రములో నిప్పచ్చరము నేలపై రాయినై యహల్య నైనాను శ్రీరామచంద్రమూర్తీ! రామ రామ నా పేరు లీల!


నా పేరు లీల!
ఆ ఊరిగోల పడలేక నేను పొరుగూరొ
చ్చాను! అందాలవాడే అడవిలో ముం
చాడు; అందరిని తలచుకొని అల్లాడు
చున్నాను.

ఏకాకినై నేను దూరాన ఉన్నాను దారినే
పోయే అమ్మలక్కలు జేరి ముండ్ల చూపులు
చూచి అడుగుతూ పోతారు.

ఏకాకినై నేను నడిజాము వరకూ మేలుకొని
మృత్యువును బ్రతిమాలు కొన్నాను!

అమ్మమ్మ జ్ఞాపకం, అమ్మ జ్ఞాపకం, చెల్లెలు
జ్ఞాపకం, నాన్న జ్ఞాపకం, అన్నలే జ్ఞాపకం,
తమ్ములే జ్ఞాపకం, అందరిలో నువ్వే ఆఖరి
జ్ఞాపకం! రావేల! రావేల రాత్రి వచ్చింది!
మధురమౌ మగవాడ నాప్రేమ నిజమోయి!

ప్రాభాతమౌ వేళ జ్ఞాపకాలొచ్చాయి!
తలిచి తలిచీ నిన్ను జ్ఞాపకాలొచ్చాయి!
పవళింపు సమయాన జ్ఞాపకాలొచ్చాయి!
తలనొప్పి తీర్చుతూ తలగడగ రావోయి!
చలికాల మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
చైత్రమాస మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
వర్షాకాల మొచ్చింది జ్ఞాపకాలొచ్చాయి!
పిలుపులకు పలకనందులకై ఈఘడియ
ఈక్షణము జ్ఞాపకాలొచ్చాయి! రావేల
మగవాడ! ఒడ్డూ పొడుగూవాడ!

ఏకాకినై నేను ఏదారిపోయినా పిలుపు
పిలుపుకు పలికే జ్ఞాపకాలొచ్చాయి! ఏకా
కినై నే ఏమి పనిజేసినా తలుపు తలుపుకు
త్రవ్వి జ్ఞాపకాలొచ్చాయి! మరో పిల్లను
నీవు మరులు గొల్పావో, వేరో
పిల్లకు నీవు ఉరులు వేశావో, రావోయి
రావోయి త్వర త్వరగ రావోయి, నాకన్ను
చెదిరింది పురుషులను జూస్తూ!

బుల్‌ బులుల హాయికై కిల కిలల జోలకై
పరితపించే మనస! కన్నీళ్ల హృదయమా!
బుల్‌ బులుల మన్నా కిల కిలల మన్నా
ముత్తైదు ముద్దు టుయ్యాలకే కద్దు!

బులు బులుబులు బులా హాయీ యీ!
హాయమ్మ, నెవ్వరూ పురిగొల్పినావారు?
పురిగొల్పినావాడు పురుషుడే కాడు! మగ
పిల్లవాడవో, ఆడపిల్లవొ నీవు, మగవాడవై
నీవు మాయదారి వవకుండ, ఆడపిల్లవై నీవు
అర్ధాన్న మవకుండ ఎన్నెమ్మయే వచ్చి
పురుడు పోసింది! కొత్తెమ్మయే వచ్చి ఉగ్గు
కలిపింది! పోతరాజే వచ్చి చేదవేశాడు!
కొత్తెమ్మయే వచ్చి చాట పరిచింది!

బులు బులుబులు బులా హాయీ యీ!
హాయమ్మ నెవ్వరో చంకెత్తి కెళ్ళారు! నా
చన్నులో పాలు చేపుతున్నాయే! ఉయ్యా
లలో పిల్ల ఉబుసులే లేవు! నా చన్నులో
పాలు జున్ను లెత్తాయే!

హాయమ్మ కెవ్వరూ హాయన్న వారూ!
నీలాల సంద్రములో నిప్పచ్చరము నేలపై
రాయినై యహల్య నైనాను శ్రీరామ
చంద్రమూర్తీ! రామ! రామ! నా పేరు లీల!
AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )