| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
14. బీదమందు
తూర్పు తెల్లారింది, వాన వెలిసింది! అమ్మ పోయే మందెట్టుకు రాయే!
కాండబ్బైనా లేదు, కాసైనా లేదు! కాత్తె కూత్తె కైతే డాక్టేరు రాడే!
సందేళ సలిజరం ఊర్కే పోదే! సందొచ్చిన పిల్లోడు ఉలుకుతుండాడే!
ఏయాకో తింటుంది గజ్జెట్టిన కుక్క! నేపాళం మాత్రెయ్యే, లేత్తాడు పిల్లోడు!
పాతాళం బలిసెక్రవర్తీ! సంకురాత్రి పండక్కు నేపాళం సెట్టిక్కిరా! జబ్బులన్నీ పోతాయి!
తూర్పు తెల్లారింది, వాన వెలిసింది! అమ్మ
పోయే మందెట్టుకు రాయే!
కాండబ్బైనా లేదు, కాసైనా లేదు! కాత్తె
కూత్తె కైతే డాక్టేరు రాడే!
సందేళ సలిజరం ఊర్కే పోదే! సందొచ్చిన
పిల్లోడు ఉలుకుతుండాడే!
ఏయాకో తింటుంది గజ్జెట్టిన కుక్క! నేపాళం
మాత్రెయ్యే, లేత్తాడు పిల్లోడు!
పాతాళం బలిసెక్రవర్తీ! సంకురాత్రి పం
డక్కు నేపాళం సెట్టిక్కిరా! జబ్బులన్నీ పోతాయి!