| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
15. చాలు చాలు!
ఈ నిరాశాకాశ ప్రవాసాన చీకటిలోని గువ్వవలె ఏకాకినై ఏకాననముననో ఉన్న నాకు చాలులే! చాలు!
ఏ యంతః పురాంతరాళముననో హాయిగా ఉండే నిన్నుదలచుచు వేటాడుచు నేను ఇక్కట్లు పడుచుండే వేళల నే నేవేళనైన నా వారికోసము చేసే దూరాన వినబడే బూరనాదము చేసే ఆక్రోశము విని అతడింకా జీవించియే ఉన్నాడని విని నీమనసులో నీలోననే నిట్టూర్పు విడిచితే చాలు చాలు! చాలుగానీ నిట్టూర్పుతో బాటు నిష్ఠూర మాడ మోకు!