కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

10. జైజైలు

మారో! మారో! మారో! మారో! ఒకటీ రెండూ మూడూ నాల్గు: మారో! మారో! మారో! మారో! ఐదూ ఆరూ ఏడూ ఎనిమిది: మారో!

పోండి! పోండయ్యా పోండి! దెబ్బలెందుకు తింటారు; లేండి! లేండయ్యా లేండి! మీగ్గాదూ చెప్పేది! మారో!

మారోమారో! మారోమారో! ఇరవైయెనిమిది ఇరవైతొమ్మిది: మారోమారో! మారోమారో! ఇరవైతొమ్మిది, మడత పెట్టి మారో!

సారాలూ, కుర్మాలూ తాగించే తండ్రులు దొరోళ్లు గొప్పలా సొరాజ్జం గొప్పదా? మారో మారో!

మదమెక్కి బామ్మలు చేత్తుండారంతా! యదవలంట్రా మనం చూత్తూరు కోటానికి? మారో మారో!

సాయిబ్బోయి సాయిబ్బోయి! సేయిసిక్కంగా యేస్కో! జైజైలు కొడదాం వెయ్యేళ్లు చార్జెంటుకు: మారో మారో!

బామల్కీ నమ్మక్రాం! మీక్మాకీ కలుద్దాం! చార్జెంటుకీ వెయ్యి సలాం! చార్జీ లేద్దేనికైనా: మార్‌ మారో మారో!

ఎన్నడా యదవలు! యన్నమో వళవలా మిన్నె, మిన్నె పేసరది క్షణం క్షణం చుమ్మా మార్రా మార్రే!

సూపరెంటడుగో! చప్పుడౌతుండాడు! సెప్పుతో సెపుతాడు సిప్పలెగిరేట్టూ! మార్రా మార్రా!

సక్కగా ఉందిరా పక్క పాపిటపిల్ల! సంకలో వెయ్యరా రెక్కెట్టుకులాగి; మారో మారో! సారాయికీజై సార్జెంటుకూజై! మారో మారో! మారో మారో!

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )