| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
07. పుట్టింట పిల్ల
మాటు గలదే మాట, పట్టుగలదే పలుకు, మాట పట్టింపులది పుట్టింటి పిల్ల!
ఆటు గలదే ఆట పోటు గలదే పాట! ఆట పాటల గలది అదేం ఎరగని పిల్ల!
పెద్దదైన పిల్ల పుట్టింటికై పోయి మాట పట్టింపుతో మళ్ళీ రాలేదు.
సమత్తాడిన పిల్ల పుట్టింటోనే ఉంది, తెల్లవారు తరుణము తలపు లేవేవో!
నోములైన పిల్ల పుట్టింటోనే ఉంది, పొద్దు పోయే తరుణము మనసేమిపడునో!
పండుగ రోజున పిల్ల పుట్టింటోనే ఉంది, వెన్నెలొచ్చే వేళ ఊహలు ఏరకమో!
పదునెనిమిది ఏండ్లపిల్ల పుట్టింటనే ఉంది, చీకటి తరుణమున చూపులు ఏవైపో!
మెట్టిన ఇల్లు వదలి పుట్టింటనే ఉంది, నిద్రపోయే సమయమున కలలేమి కనునో!
అక్కడ్నే ఉందక్కడ! పుట్టింటక్కడ్నే ఉంది! తాళ్లేమీ లేకనే ఉట్టికెక్కింది పిల్ల ఉరి పోసుకుందోయి!