కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 051. ఏమొ
51. ఏమొ
ఈ యగాధ నిశీధాన నెట్టయెదుట
వెలుగు కన్పించెనని అదే కులకబోకు
కొఱివిదయ్యాలొ? యెవరైన నరులయొక్క
కరములం దుండు దీపాలకాంతు లేమొ?
    ఈ యఖండ సముద్రాన నేరి కోరి
    సంచులకు నిండ దెస్తిని సంపదంచు
    మురవగా బోకు కిందుమీ దెరగకుండ
    నత్తగుల్లలొ? మంచి రత్నాలొ యేమొ?
ఈ కీకారణ్య మధ్యాన నిచట నచట
దిరిగి యేవేవొ వేళ్ళేవొ తీగ లిన్ని
మోపులకు దెచ్చినా నని మోజుపడకు
చచ్చుతీగలొ? జీవనౌషధులొ యేమొ?
    ఈ మహాతిరణాలలో నీడ నాడ
    నెఱుకలేని మనుష్యుల పరిచయమ్ము
    లబ్బెగాయంచు నుబ్బి తబ్బిబ్బులవకు
    శత్రులో? ప్రాణమిచ్చేటి మిత్రు లేమొ?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 051. Emo - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )