కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 147. జీవితరహస్యము
147. జీవితరహస్యము
ఈ జీవితమ్మున కేమర్థ మోయి
నామనోహర, ప్రియా! నారాజ! చెపుమ,
శరదంపు సూర్యునికిరణాలు నీదు
బంగారుశిరముపై బర్వియుండంగ.
చాందీతళుక్కుల సంజల నీదు
విమలస్వరం బిట్లు వినుపించుచుండ
మనుజుల కనుబ్రామి మాయమై చనిన
ప్రకృతిదౌ పరమరాహస్యమ్మదేమి?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 147. jIvitarahasyamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )