కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 159. కన్నెనోము
159. కన్నెనోము (శాఫోగీతము)
కన్నెనై యెల్లపుడు కాలమ్ము బుత్తు
నీవు నాభర్తవు గావేని ప్రియుడ!]
పరపురుషు డెవ్వడున్‌ బడయడు నన్ను
ఇప్పటికేని యింకెప్పటికేని.
ఈ వొక్కడవె సుమ్ము యేరగాగలవు
అతిసుకుమార మీ యందంపుసుమము
అద్దుకు, దివ్యమౌ నగరుధూపమ్ము
బలె, దీనితావి గాపాడు మెల్లపుడు
నీవె సుమి నాప్రేమ నెమ్మనమ్మందు
జ్ఞాపకముంచుకోగలవు, రాగల్గు
కాలాల మోదమ్ము, గర్వమున్‌, శాంతి,
రాగమ్ముతో పవిత్ర మ్మొనర్పగదె!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 159. kannenOmu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )