కవితలు దాశరథి కవితలు అగ్నిధార
15. చంద్రోదయం
 
వచ్చినవాడు చంద్రముడు
    పాలసముద్రపు మూలనుండి గో
ర్వెచ్చని మీగడల్‌ మెసవి
    రే జవరాలి వరాల బుగ్గలన్‌
గిచ్చి నవారుణస్ర మొలి
    కించుచు తూరుపులోన కాగడా
తెచ్చెనొ ఆర గాసి జిగి
    దేరిన వెన్నెల జ్వాల లెత్తగా.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - chaMdrOdayaM - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )