కవితలు దాశరథి కవితలు అగ్నిధార
16. కవీ!
 
నరకానన్‌ బడి క్రుంగుచున్న నను గం
    ధర్వాప్సరః కామినీ
తరుణ స్వాదు నవోపగూహన పథాం
    తర్వర్తిగా జేసి దు
ద్భర దారిద్ర్య పిశాచినీ రుధిర ధా
    రాక్రూర దంష్ట్రా ప్రఘా
త రిరంసా పరిఖిన్నతన్‌ మరపు నొం
    దన్‌ జేతువోయీ! కవీ!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - kavI - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )