కవితలు దాశరథి కవితలు అగ్నిధార
42. ఇల
 
మ్రింగటానికో యేమో!
నింగికి పొంగుతూ సముద్రం
తొంగి చూస్తోంది నావైపు;
దొంగ! వొస్తోంది నావైపు!
ఆకాశం, పాతాళం
ఏకోశం తాకకుండ
ఏకాకినిగా భూమి న్నేను
ప్రాకుతున్నాను అయోమయాన్ని!
గాలికంటె తేలికగా
తేలిపోతున్నా న్నేను
చాలా బరువున్నా నేను
"గాలి యీత" యీత్తున్నాను!!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - ila - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )