కవితలు దాశరథి కవితలు అగ్నిధార
8. జ్వాలాతోరణము
 
జ్వాలాతోరణమాల కొండసిగపై
    బంధించినా రెవ్వరో
బాలా! మాధవమాస వాసరములన్‌
    ప్రత్యగ్ర మాధ్వీక పు
ష్పాలన్‌ బంభర కంబుకంధరలు త
    ప్పన్‌ ద్రావి నిద్రింపగా
కాలజ్వాలలు చుట్టుముట్టినవి సౌ
    ఖ్య ధ్వంసకాగ్న్యౌఘముల్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - jvAlAtOraNamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )