| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 27. కాలపు కంటిలో | |
|
కాలపు కంటిలో కరకు కత్తులు గ్రుచ్చి, మెరుంగు నెత్తురుల్ కాలువ కట్టి తెచ్చి, ధన కాళికకున్ బలి యిచ్చి, యెన్ని కా లాలు వరమ్ము లందెదరు రా? నిరుపేదల బూది మోమునన్ దాలిచి భక్తియుక్తుల స దాశివునేన్ బులిపించ నెంచుచున్? | |