| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 28. కిరణాగ్రము | |
|
ఎందుకు పాడినావు పుల కింపని నా హృదయంపుటంగణం బందున వేణుగీతములు? హారతు లెందుల కెత్తినావు? నీ డెందమె కప్పురంపు పొగ లేపి దిశావలయాలలోని దు ర్గంధము వాపుచుండ? కవి రాజ! దరిద్ర పిశాచినీ ప్రభో! | |
|
ఈ చీకట్లను దాటి దాటి యెవడో యేమో! ప్రభాభాండముల్ ప్రాచీ ప్రాంగణమందు చానుపులు చ ల్లన్ తెచ్చుచున్నాడు; తా రా చౌర్య మ్మొనరించినాడు; రజత ప్రాకారముల్ కూల్చి నా లో చొక్కంపు పసిండి సౌధముల బా రుల్ తీర్చ నున్నాడురా! | |
|
బండవారిన నీళ్ళు కూర్చుండి కదల వా హిమాచల శిఖర సందోహ మందు; నీల శిలల ప్రాకారంపు నెఱియలందు నుండి బాలార్క కిరణమ్ము లురికి రావొ? | |