| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 26. రైతు | |
|
పంట పొలాలలోన తెల వారులు నిద్దుర కాచి, వేకువన్ ఇంటికి వచ్చి చల్ది మెతు కెంగిలి చేసియొ చేయకో పనుల్ వెంటబడంగ కాననము వీథుల బోయెడి కాపుబిల్డి! నీ వంటి స్వయంప్రపోషణ వి భావము రాజుల కబ్బజాలునే! | |
|
ఎన్ని పుణ్యాలు చేసి జన్మించినావొ! ఈ ధరాభామినీ మధురాధరాన అమృత మొలికించినావు నీ హలముతోడ; హాలికా! వేనవేల దండాలు నీకు. | |