కవితలు దాశరథి కవితలు అగ్నిధార
22. ప్రభూ!
 
నా బంధమ్ములు విచ్చిపోయినవి; చిం
    తాకంత సంతాప చిం
తా బంధుత్వము నాకు లేదు; ఋణ సాం
    తం బెత్తి చెల్లించితిన్‌;
నే బోరాని ప్రదేశమం చొకటి లే
    నే లేదు; రక్తాబ్జ మా
లాబద్ధాభ్యుదయోత్సవ ప్రథమ సం
    ధ్యా వీథులన్‌ బోయెదన్‌;
అంతయొ ఇంతొ నీ పలుకు
    లర్థ మగున్‌; నిను గూర్చి కూయు వే
దాంతుల కూత ఒక్కటియు
    నర్థము కాదు; గ్రహించినాడ వ్యో
మాంతర తారకా మధుర
    హాసములో ధ్వని; చెట్టు చేమలన్‌
గంతులు వేయు మూగి నుడి
    కారము, తోయని విశ్రమింపులన్్‌.
(రవీంద్రుడు)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - prabhU - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )