కవితలు దాశరథి కవితలు అగ్నిధార
3. రైతుదే
 
ప్రాణము లొడ్డి ఘోర గహ
    నాటవులన్‌ బడగొట్టి, మంచి మా
గాణములన్‌ సృజించి, ఎము
    కల్‌ నుసిజేసి పొలాలు దున్ని, భో
షాణములన్‌ నవాబునకు
    స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి
    నక్కకు రాచరికంబు దక్కునే?
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నినుబోలిన రాజు మా కెన్నడేని;
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాలవీణ.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - raitudE - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )