| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 12. వాసంతిక | |
|
ఓ వాసంత కుమారి! నీ పెదవులం దూరెన్ మరందాంబు ధా రా వాఃపూరము; త్రావినాడ పుడిసి ళ్ళన్, చెంబులన్, బిందెలన్; రావే, నా హృదయంపు సైకత ధరా రంగాన పొంగారి శో భా వాల్లభ్యము నగ్గలింపుము; మధు ప్రాభాతిక స్వామినీ! | |
|
నీ నును బుగ్గలందు రమ ణీ! అరుణారుణ బాలభాను డే లా నటనార్థియై ఉదయ రాగమునన్ పరువెత్తి వచ్చు? ప్ర స్థానిత తీక్ష్ణతన్ చెలగి తాండవ మాడును? నా కలంపు వి న్నాణముతో రచింతు లల నా! నును చెక్కులపైని కావ్యముల్. | |
|
పచ్చని చెట్టుక్రింద తెల వారక ముం దొకనాడు నీవు నేన్ వచ్చితి మొక్కమారుగ; భ వత్సుకుమార కరాంగుళీయకం బిచ్చితి, నాదు వ్రేలునకు పెట్టితి; వెన్నడు నన్ను వీడకో వెచ్చనివాడ; యంచు శల విచ్చితి వో మధు కన్యకా మణీ! | |