కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
05. మేలుకొలుపు
 
సంజ కడాని క్రొమ్మొయిలు చాటున పక్కున నవ్వు చుక్కలో
పుంజితమైన రాతిరి కవుంగిట నిద్దురపోవు చందమా
మం జపియించు చెంగలువ మానిని కన్నులలో ప్రవాళరే
ఖం జతసేయు భాను కర కంజము లోకము మేలుకొల్పెడిన్‌.
ప్రాత దనాల భారమున వ్రాలిన నెన్నడుమున్‌ గలట్టి ఈ
భూతల భామినీ హృదయ ముగ్ధత కన్నుల నీరుదెచ్చుగా
దా! తరుణారుణార్క కరతర్పిత నవ్య విభాత భాండ సం
ఘాత విభాజలమ్ములు జగమ్మును నిద్దుర మేలుకొల్పెడిన్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - mElukolupu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )