కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
07. పచ్చని గడ్డిపై
 
పచ్చని గడ్డిపై కరకు
    పాదము లెంతటి కక్షబూనెరా!
మచ్చుకు గడ్డిపోచ కను
    పట్టదు! దైవము కూడ ఈ క్రియన్‌
మెచ్చిన యట్టు లూరకొనె;
    నేడు హఠాత్తుగ వానజల్లులే
వచ్చిపడెన్‌; ధరాతలము
    పచ్చబడెన్‌ మరలన్‌ తృణాళితో!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - pachchanigaDDipai - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )